ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్యాసింజర్లకు శుభవార్త
దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు శుభవార్త. ఇకపై ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, విదేశీ సర్వీసులలో ప్రయాణించే వ్యక్తుల నుంచి తీసుకునే యూజర్ డెవలప్మెంట్ పీ (యూడీఎఫ్)ను తగ్గించారు. డొమెస్టిక్ సర్వీసుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ఇక నుంచి కేవలం 10 రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రూ.45 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేష్ అధికారికంగా ప్రకటించారు.








