బీజేపీలోకి అక్షయకుమార్ ?
బాలీవుడ్ నటుడు అక్షయకుమార్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్దేశంతోనే అక్షయ్ సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చే సినిమాల్లో నటిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ క్యాంపెయిన్ నేపథ్యంలో తెరకెక్కించిన టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మేలో అక్షయ్ మోడీని కలిసి మాట్లాడారు కూడా. అంతేకాదు ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వినోదపు పన్ను ఎత్తివేయనున్నారు. ఇదొక్కటే కాదు మొన్నామధ్య అక్షయ్ జవాన్ల కోసం భారత్‌కే వీర్ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు. పుణెలో ఆరెస్సెస్ శివ శక్తి సంఘం పేరిట చేపట్టిన ఓ కార్యక్రమం అక్షయ్‌కి బాగా నచ్చిందని అరెస్సెస్ నిర్వహించే ప్రాజెక్ట్‌లలో సాయం చేయడానికి అక్షయ్ ఆసక్తి చూపారని అరెస్సెస్ జాయింట్ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబలే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే అక్షయ్ బీజేపీలో చేరే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్.













