ఎయిర్ ఏసియా కొత్త ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏసియా వినయోగదారులకు కొత్త ఆఫర్ను ప్రకటించింది. స్వదేశీ మార్గాల్లో కనీస ఛార్జీలను 1299 రూపాయలు, విదేశీ మార్గాల్లో 2399 రూపాయలు తగ్గించింది. ఈ ఆఫర్ కోసం అక్టోబరు 2 నుంచి 15లోపు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 అర్థరాత్రి నుంచే టికెట్లు బుకింగ్ ప్రారంభమైంది. అక్టోబరు 2 నుంచే వచ్చే సంవత్సరం మార్చి 31 మధ్య ప్రయాణిలకు ఇది వర్తిస్తుంది. స్వదేశీయంగా హైదరాబాద్, కోల్కతా, కొచ్చి న్యూఢిల్లీ, రాంచీ పుణె తదితర మార్గాల్లో ప్రయాణీకులు దీనిని వినియోగించుకోవచ్చె అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బాలి, బ్యాంకాక్, మెల్బెర్నో, సిడ్నీ, సింగపూర్, ఆక్లాండ తదితర మార్గాలతో పాటు ఆసియాఖండంలోని 120 మార్గాలకు ఈ సదుపాయం కల్పించినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఏసియా అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని వారు పేర్కొన్నారు.








