రూ.950 కే ఎయిర్ఏషియా టికెట్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ విమాన టిక్కెట్ ప్రారంభ ధరను రూ.950గా నిర్ణయించిన సంస్థ, అంతర్జాతీయ రూట్లలో రూ.7,499కి విక్రయింనున్నది. జూలై 2 లోగా బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే ఈ తగ్గింపు ఆఫర్ వర్తించనున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు నవంబర్ 23లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ హైదరాబాద్‌లోపాటు పుణె, న్యూఢిల్లీ, కోల్‌కతాలకు విమాన సేవలను అందిస్తున్నది.








