ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై శాకాహారానికి మాత్రమే పరిమితం కావాలి. దేశవాళీ సర్వీసులన్నింటిలో ఎకానమీ క్లాస్ లో ఇకపై శాకాహారాన్ని మాత్రమే అందిస్తామని, దీనివల్ల సాలీనా రూ.7కోట్ల నుంచి రూ. 8కోట్ల వరకూ ఆదా అవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. అంతర్జాతీయ సర్వీసుల్లో మాత్రం మాంసాహారాన్ని అందిస్తామని తెలిపింది. అప్పులు పెరిగిన వేళ, ఖర్చులను తగ్గించుకునేందుకు తీసుకునే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.








