మొన్న రాహుల్… ఇప్పుడు సోనియా
మొన్న రాహుల్ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులపై సొంత నియోజకవర్గం ప్రజలే ఎదురు తిరుగుతున్నారు. మొన్న అమేథీలో రాహుల్ గాంధీ కనిపించుట లేదు అని పోస్టర్లు కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాయ్‌బరేలీలో సోనియా గాంధీ కనించుట లేదంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. గోర బజార్, మహానంద్పూర్, గవర్న్మెంట్ కాలనీల్లో రాత్రికి రాత్రే పదుల సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. సోనియా కనిపించడం లేదని, ఆమె ఆచూకీ కనిపెట్టినవారికీ తగిన రివార్డు కూడా ఇస్తామన్నది ఆ పోస్టర్లలోని సారాంశం. సోనియా గాంధీ ఈ ఏడాది అసలు తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. అటు రాహుల్ కూడా గత ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా అమేథీకి వెళ్లలేదు.








