ఎన్డీయే అభ్యర్థిని ప్రకటించాక తుది నిర్ణయం చెబుతాం
విపక్షాల తరఫున ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి దాదాపు 17పార్టీల నేతలు హాజరవగా అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు సాగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాము తుది నిర్ణయం చెబుతామని ఆమె తెలిపారు








