గిన్నిస్‌బుక్‌లోకి ‘ఆదియోగి’ విగ్రహం
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఇషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి విగ్రహం గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. మార్చి 11న విగ్రహావిష్కరణ అనంతరం నిత్యం వేలాది మంది సందర్శకులు వచ్చి వెళుతున్నారు. 2006 అక్టోబరు 17న, 8,52,587 మొక్కలు నాటిన సందర్భంగా గిన్నిస్‌లో ఇషా ఫౌండేసన్ స్థానం పొందింది. తాజాగా ఆదియోగి విగ్రహంతో గిన్నిస్‌లో స్థానం లభించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.








