సీఈసీగా బాధ్యతలు చేపట్టిన అచల్
21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణలోకి తీసుకొంటారు. జనవరి 23, 1953లో జన్మించిన అచల్ కుమార్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గుజరాత్ కేడర్‌కు చెందిన వారు. నదీం జైదీ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే.








