మరో రెండు పథకాలకు ఆధార్ తప్పనిసరి
మరో రెండు సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కానుంది. కిరోసిన్‌పై ఇచ్చే రాయితీని పొందడానికి, అటల్ పెన్షన్ యోజన కింద ప్రయోజనాలు పొందడానికి ఆధార్ నెంబరు సమర్పించవలసి ఉంటుంది. ఆధార్ నెంబరు లేని వారు ప్రస్తుతానికి ఇతర గుర్తిపు కార్డులను సమర్పించవచ్చు.
* అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారులు ఆధార్ ఇవ్వడానికి తుది గడువు ఈ నెల 15.
* కిరోసిన్ రాయితీ పొందదలచిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి, ఆధార్ సంఖ్య సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబరు 30.
* వంట గ్యాస్ మాదిరిగానే కిరోసిన్‌కు ఇస్తున్న రాయితీని కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం ఆధార్‌ను విధిగా సమర్పించాల్సి ఉంటుంది.
* అటల్ పెన్షన్ యోజన కింద 18-40 ఏళ్ల వయసు వారు ప్రీమియం చెల్లిస్తే వారికి 60 ఏళ్ల తరువాత పింఛను వస్తుంది. వారు చెల్లించిన ప్రీమియం అనుసరించి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు వస్తుంది. వారు చనిపోయిన తరువాత జమయిన మొత్తాన్ని వారసులకు ఇస్తారు.








