విమాన టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి కాదు!
విమాన టికెట్ల బుకింగ్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం సృష్టం చేసింది. విమాన టికెట్లకు ఆధార్ నెంబర్‌ను ఇవ్వాలా అంటూ పలువురు ఎంపీలు సందేహం వ్యక్తం చేయడంతోపాటు కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ద్వారా వివరణ కోరారు. ఇదే విషయం పార్లమెంటు స్థాయి సంఘం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. పి.చిదంబరం సారధ్యంలోని స్థాయి సంఘానికి కేంద్ర వివరించింది. విమాన టికెట్ల బుకింగ్ సందర్భంలో ఆధార్ నంబర్‌ను తప్పనిసరి కాదని, ఆ యోచనే లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.













