హరియాణాలో ట్రంప్ గ్రామం!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లి, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తొలిసారి భేటీ కానున్న నేపథ్యంలో హరియాణాలోని ఓ గ్రామం అసాధారణ చర్య తీసుకుంది. మోదీ పర్యటనను స్వాగతిస్తూ తన గ్రామం పేరును ట్రంప్ గ్రామంగా మార్చుకుంది. ఈ నూతన నామకరణ తంతును గ్రామస్థులు అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఊరంతా ట్రంప్, మోదీ చిత్రాలను అలంకరించారు. ట్రంప్ గ్రామానికి స్వాగతం అంటూ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో మరుగుదొడ్లను కట్టిస్తున్న సులభ్ సంస్థ సూచన మేరకు ఈ పేరు మార్పిడి చోటుచేసుకుంది. అయితే తాజా పేరు మార్పిడి అధికారికం కాదు. వాస్తవానికి ఈ గ్రామం పేరు మరోరా. అధికారిక రికార్డుల్లో మారోరానే కొనసాగనుంది.








