దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో, పుణె, నాగ్పూర్ వంటి ప్రధాన నగరాల్లో 9రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దసరా వేడుకలను బెంగాలీలు, కన్నడవాసులు వైభవంగా జరుపుకుంటారు. వీళ్లకు విజయదశమే అతిపెద్ద పర్వదినం.








