400 ఏళ్ల తర్వాత ఆ వంశానికి వారసులు
దాదాపు 400 ఏళ్ల తర్వాత మైసూర్ రాజ్యానికి శాపం నుంచి విముక్తి లభించినట్టయింది. ప్రస్తుత మైసూర్ యువరాజు యుదువీర్ క్రిష్టదత్తా చమారాజా ఒడియార్ తండ్రి కాబోతున్నాడు. అవును, దాదాపు 400 ఏళ్లు గా ఆ రాజ్యంలో పిల్లల అలికిడి లేదు. ఆ రాజ్యాన్ని పరిపాలించిన ఏ రాజుకు పిల్లలు పుట్టలేదు. అయితే, మే 2015లో మైసూర్ రాజ్యానికి రాజయిన యుదువీర్, జూన్ 2016 లో రాజస్థాన్ యువరాణి త్రిషికా వివాహమాడాడు. త్రిషిక ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి. దీంతో మైసూర్ రాజ్యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.








