ఎన్ఆర్ఐలకు 360 రోజుల ముందే రైలు టిక్కెట్లు
విదేశీయులు, ఎన్ఆర్ఐలు ఇకపై 360 రోజుల ముందుగానే భారత్లో రైలు ప్రయాణాలకు రిజర్వేషన్ చేయించుకునేందుకు రైల్వేశాఖ వీలు కల్పిస్తోంది. ఇంతవరకు వారంతా తమ ప్రాంతాల నుంచి 120 రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ చేయించుకునే వీలుండగా, ఆ వ్యవధిని పెంచుతూ ఈ వారంలో రైల్వేశాఖ ప్రకటన చేయనుంది. అయితే మెయిల్ ఎక్స్ప్రెస్లు, రాజధాని, శతాబ్ది, గతిమాన్, తేజస్ రైళ్లలో ఏసీ ప్రథమ, ద్వితీయ, ఎగ్జిక్యూటివ్ తరగతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. స్లీపర్, మూడో తరగతి ఏసీలకు వర్తించదు.








