రాష్ట్రపతి ఎన్నికలపై అమిత్‌షా త్రిసభ్య ప్యానల్
రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల ప్యానల్‌ను అమిత్‌షా సోమవారంనాడు నియమించారు. ఈ ప్యానల్లో రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఈ ప్యానల్ నిర్ణయిస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంప్రదించి ఏకాభిప్రాయ సాధనతో అభ్యర్థిని ప్యానల్ ఎంపిక చేయనుంది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. దీంతో ఇటీవలే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ జైదీ ప్రకచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 14న నోటిఫికేషన్ విడుదలవుతుంది. 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 28 చివరి తేదీ. జూలై 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు ఉంటుంది.








