ద్వితీయ వార్షికోతం సందర్బంగా రూ.802 విమాన టిక్కెట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రూజెట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా విమాన టికెట్ ధరలు 802 రూపాయల (అన్ని కలుపుకుని) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్వేస్ ట్రూజెట్‌ను నిర్వహిస్తోంది. అందరికీ విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ (ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్)కింద తొలి ఎస్‌సిఒ (షెడ్యూల్డ్ కమ్యూటర్ ఆఫరేటర్) పర్మిట్‌ను అందుకున్న తొలి ఎయిర్‌లైన్స్ ట్రూజెట్ అని టర్బో మేఘా తెలిపింది. ట్రూజెట్ కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలోనే అందరికీ చేరువ కావటం ఎంతో సంతోషాన్నిస్తోందని, రానున్న రోజుల్లో సంస్థ మరింత మంది ప్రయాణికుల విశ్వాసాన్ని చూరగొంటుందని భావిస్తున్నట్లు టర్బో మేఘా ఎయిర్వేస్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాలయపాటి ఉమేష్ తెలిపారు. ట్రూజెట్ ప్రస్తుతం నాలుగు ఎటిఆర్-72 విమానాల ద్వారా సేవలందిస్తోంది.








