భవిష్యత్తులో రూ.2000 నోటు రద్దుయ్యే అవకాశం
పెద్ద నోట్ల రద్దు వ్వవహారంలో ఆర్బిఐ ప్రతిష్ట కొంత దెబ్బతిన్న మాట వాస్తవమేనని, అయితే పూర్తిగా బలహీనపడిందంటే తాను నమ్మనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి సృష్టం చేశారు. హైదరాబాద్లో చంద్ర రాజేశ్వరరావు 103 జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకు నోట్ల రద్దు ఉపయోగపడిందా? లేదా అని తేలేందుకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. భవిష్యత్తులో రూ.2000 నోట్లు రద్దయ్యే అవకావమున్నది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనాన్ని అరికట్టేందుకు ఎక్కువ విలువ కలిగిన నోట్లను రద్దు చేయాలనే దానిపై చర్చ, పరిశోధన జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో మన దేశంలోనూ రూ.2000తో పాటు అధిక విలువ కలిగిన నోట్లను పూర్తి రద్దు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.








