14 ఏళ్లకే పైలట్!
సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపిన అతి చిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన మన్సూర్ అనిస్(14) ఘనత సాధించాడు. షార్జాలోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అనిస్ సెస్నా-152 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపి కెనడా ఏవియేషన్ అకాడమీ నుంచి ఫైలట్ సర్టిఫికేట్ పొందాడు. పార్కింగ్ స్థలం నుంచి రన్ వే వరకు దాదాపు పది నిమిషాల పాటు ఒక్కడే విమానం నడిపాడు.








