హర్మూజ్ లో అమెరికా సీక్రెట్ మిషన్.. !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. హర్మూజ్ జలసంధి మార్గంలో తాము సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. వైట్ హౌస్ మీడియా సమావేశంలో ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. మీకెవరికీ తెలియని ఓ విషయం చెబుతాను. మేం సీక్రెట్ మిషన్ చేపట్టి హర్మూజ్ (Strait of Hormuz) మీదుగా లక్షలాది బ్యారెళ్ల చమురు (Crude Oil)ను తరలించాం. ఈ విషయాన్ని ఇరాన్ (Iran) కూడా ఇప్పుడే తెలుసుకుంటుంది. ఒక్క రాత్రే 22 నౌకలను తరలించాం. చిమ్మచీకట్లో లైట్లు లేకుండా రాడార్లకు చిక్కకుండా వాటిని సురక్షితంగా పంపించాం’’ అని అమెరికా అధ్యక్షుడు వివరించారు.
దీంతో ట్రంప్ వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. అవి ఏ దేశ నౌకలు, ఎక్కడినుంచి వెళ్లాయన్న వివరాలపై కూడా స్పష్టత లేదు. ఈ క్రమంలోనే అమెరికా సీనియర్ మిలిటరీ అధికారి ఒకరు దీనిపై స్పందించారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు అమెరికా ఎస్కార్ట్ ఇచ్చిన విషయాన్నే ట్రంప్ ప్రస్తావించినట్లు తెలిపారు. అగ్రరాజ్య మిషన్‌లో భాగంగా చమురు, వాణిజ్య నౌకలు హర్మూజ్‌ను దాటేందుకు అమెరికా గైడెడ్ నౌకలు భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు
గత నెలలో దాదాపు 70 నౌకలకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎస్కార్ట్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉద్రిక్తతలు తగ్గడంతో హర్మూజ్‌లో నౌకల రవాణా పెరిగింది. నెల రోజుల వ్యవధిలో దాదాపు 200 నౌకలు ఈ జలసంధిని దాటినట్లు అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముందు నెలకు దాదాపు 3వేల నౌకలు ఈ మార్గం మీదుగా ప్రయాణించేవి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రంగా మారాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కానీ, ఈ జలమార్గం తమ నియంత్రణలోనే ఉందని అగ్రరాజ్యం చెబుతోంది. ఈ పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌లో చమురు రవాణా కోసం తాము రహస్య ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వెల్లడించారు.








