పవన్ ఖేరాకు మళ్లీ చుక్కెదురే.. ఈసారి అరెస్ట్?
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకి మళ్లీ చుక్కెదురే అయ్యింది. గౌహతి హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే విషయంపై మంగళవారం వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించినట్లు జస్టిస్ పార్థివ జ్యోతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో కాంగ్రెస్ నేతకు చుక్కెదురైంది.
కాంగ్రెస్ నాయకుడి ట్రాన్సిట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించి, అస్సాం కోర్టును ఆశ్రయించమని సూచించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారించే తెలంగాణ హైకోర్టుకు గానీ, అసోం హైకోర్టుకు గానీ తాము అడ్డురాబోమని కూడా సుప్రీం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే పవన్ ఖేరా అసోం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి
అసలు నేపథ్యమిదీ…
ఏప్రిల్ 5 న అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ఖేరా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో అసోం సీఎం హిమంత బిస్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు మూడు పాస్ పోర్టులు వున్నాయని, దుబాయ్ లో ఆస్తులతో పాటు విదేశీ కంపెనీలలో వాటాలు వున్నాయని ఆరోపించారు. అయితే దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా మీడియాకు చూపించారు.దీనిని సీఎం శర్మ, ఆయన భార్య రింకీ సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై అసోం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆయన చూపించినవి ఫేక్ డాక్యుమెంట్లు అని పేర్కొంటూ ఫోర్జరీ అభియోగాలు కూడా చేర్చారు.
అయితే.. ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్ నుంచి పోటీ చేసిందని, తనకు ఆధార్ కూడా అక్కడే వుందని, కాబట్టి ఈ కేసు విచారణే ఇక్కడే జరగాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. అరెస్ట్ నుంచి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది.
అంతలోనే అసోం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీంతో మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది సుప్రీం. సుప్రీంలో పవన్ పక్షాన అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. తన క్లెయింట్ ఉగ్రవాది ఏమీ కాదని వాదించారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం గౌహతి హైకోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది. అయితే కోర్టుకు సెలవులు వున్నాయని, తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు ఒప్పుకోలేదు.
చివరికి గౌహతి హైకోర్టును ఆశ్రయించగా… ఆ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో పవన్ ఖేరా అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు బలంగా జోరందుకున్నాయి.
ఇవి కూడా చదవండి








