మీ మైండ్ సెట్ ఎలాంటిదో చెప్పే సింపుల్ టెక్నిక్!
సమస్యలు, విజయాలు, ఇతరుల ప్రవర్తన పట్ల మనం స్పందించే తీరే మన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. మనస్తత్వశాస్త్రం ప్రకారం మనుషులను ప్రధానంగా రెండు రకాల మైండ్ సెట్స్‌తో వర్గీకరించవచ్చు. బలహీన మనస్కులు, బలమైన మనస్కులు. మీరు ఏ వర్గానికి చెందుతారో తెలుసుకోవడానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జే శెట్టి తెలిపిన ఈ సింపుల్ టెక్నిక్ ఉపయోగపడుతుంది:
తప్పుల పట్ల స్పందన: ఇతరులు తప్పులు చేసినప్పుడు చూసి నవ్వడం బలహీనమైన మైండ్ సెట్‌కు సంకేతం. అదే తప్పుల నుంచి నేర్చుకుని జాగ్రత్తపడటం బలమైన మనస్తత్వం.
కమ్యూనికేషన్ శైలి: ఇతరుల సమస్యల గురించి చర్చిస్తూ ఆనందం పొందడం లేదా ఇతరులపై గాసిప్స్ చెప్తూ రిలేషన్స్ ఏర్పరుచుకోవడం ఒక రకం. అలా కాకుండా, నిజాయితీగా ఉంటూ తమను తాము మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం ఉన్నతమైన మైండ్ సెట్.
ఇతరుల విజయం: మనకంటే ముందున్న వారిని లేదా విజేతలను చూసి అసూయపడటం బలహీనత అయితే, వారి విజయాన్ని అధ్యయనం చేసి నేర్చుకోవడం గొప్ప మైండ్ సెట్.
ఎవరూ పుట్టుకతో… బలహీనంగానో లేదా గొప్పగానో ఉండరు. మనం దేనిపై దృష్టి (Focus) పెడుతున్నాం అనేదే మన మైండ్ సెట్‌ను నిర్ణయిస్తుంది. మీ ఆలోచనా విధానాన్ని గమనించడం ద్వారా మీ మైండ్ సెట్ ఎలాంటిదో సులభంగా గుర్తుంచవచ్చు.








