జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 5 అద్భుత దివ్యక్షేత్రాలు!
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన పురాతన ఆలయాలు కేవలం భక్తికి మాత్రమే కాకుండా, అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు, కళాత్మక నైపుణ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.అయితే మనదేశంలోని అలాంటి అద్భుతాలను ఎన్ని మనం చూసాం.ఎన్ని చూడగలం?
పురాతన నాగరికతల పరిశోధకుడు ప్రవీణ్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పక చూడాల్సిన 5 అద్భుతమైన ఆలయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
కైలాసనాథ ఆలయం (ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర): ఎటువంటి ఆధునిక సాంకేతికత లేని రోజుల్లో, ఒకే ఒక్క భారీ బండరాయిని పైనుంచి కిందకు తొలిచి నిర్మించిన అద్భుతమైన శిల్పకళా అద్బుతం ఇది.
అంగ్ కోర్ వాట్ (కంబోడియా): భారతదేశ సరిహద్దులు దాటి విస్తరించిన మన సాంస్కృతిక వైభవానికి ఇది ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక నిర్మాణంగా, అతిపెద్ద హిందూ దేవాలయ ప్రాంగణంగా ఇది ప్రసిద్ధి చెందింది.
చెన్నకేశవ ఆలయం (బేలూరు, కర్ణాటక): దాదాపు 10,000 కంటే ఎక్కువ అత్యంత సూక్ష్మమైన శిల్పకళా రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అందుకే ఈ ఆలయాన్ని ‘కళాక్షేత్రం’ లేదా ‘కళా సముద్రం’ అని పిలుస్తారు.
పరంబనన్ ఆలయం (జావా, ఇండోనేషియా): ఒకప్పుడు ప్రాచీన భారతదేశ సాంస్కృతిక ప్రభావంలో ఉన్న ఇండోనేషియాలోని ఈ పురాతన హిందూ దేవాలయం, తన అద్భుతమైన నిర్మాణ శైలితో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
బృహదీశ్వర ఆలయం (తంజావూరు, తమిళనాడు): చోళ రాజుల ప్రతిభకు అద్దం పట్టే ఈ ఆలయ భారీ గోపురం, శిల్పకళా వైభవం ఒక్కసారి చూస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము.
ఈ దివ్యక్షేత్రాలు కేవలం దర్శనీయ స్థలాలు మాత్రమే కాదు, మన ప్రాచీన వారసత్వానికి, మహా శిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు.








