ల్యాప్‌టాప్‌లో పుట్టే వేడితో సెల్‌ఫోన్ చార్జింగ్
వృథాగా పోయే వేడిని విద్యుత్తు శక్తిగా మార్చేందుకు బెంగళూరు శాస్త్రవేత్తలు లెడ్ (పీబీ) రహిత కొత్త మెటీరియల్‌ను కనుగొన్నారు. ఈ విద్యుత్తును గృహోపకరణాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించవచ్చని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ తెలిపింది. ఉదాహరణకు ల్యాప్‌టాప్‌లో పుట్టే వేడితో సెల్‌ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రొఫెసర్ కనిష్క బిశ్వాస్ నేతృత్వంలో బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ అడ్వాన్డ్స్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ (జేఎన్సీఏఎస్ఆర్) శాస్త్రవేత్తలు క్యాడియమ్ (సీడీ) కలిసిన సిల్వర్ యాంటిమొనీ టెల్యురైడ్ (ఏజీఎస్బీటీఈ2) అనే మెటీరియల్‌ను గుర్తించారు. ఇది వృథాగా పోయే వేడి నుంచి విద్యుత్తును రాబట్టేందుకు ఉపయోగపడుతుంది.













