Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ‘సీ మైన్స్’.. అండర్ వాటర్ డ్రోన్లతో బ్రిటన్ చెక్!
పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) కేంద్రంగా ఇరాన్ సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుని సముద్రగర్భంలో భారీగా ‘సీ మైన్స్’ (Sea Mines) లేదా ‘నేవల్ మైన్స్’ను అమర్చింది. శత్రు నౌకలు అడుగుపెట్టగానే పేలిపోయేలా పన్నిన ఈ మైన్ల ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పుడు బ్రిటన్ (UK) రంగంలోకి దిగుతోంది. ఇరాన్ నావికాదళం పరిచిన ఈ మైన్ల పనిపట్టేందుకు ఏఐ (AI) ఆధారిత అండర్‌వాటర్ డ్రోన్లను ప్రయోగించాలని యూకే యోచిస్తోంది.
రంగంలోకి ‘ఆర్ఎఫ్ఏ లైమ్బే’ నౌక
అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న భద్రతా మిషన్‌లో భాగంగా బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ తమ ‘ఆర్ఎఫ్ఏ లైమ్బే’ (RFA Lyme Bay) సపోర్ట్ షిప్‌ను పశ్చిమాసియాకు (Strait of Hormuz) పంపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా సైనిక సామగ్రి, బలగాలను తరలించే ఈ నౌకను ఇప్పుడు ‘మైన్ హంటింగ్’ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. సంప్రదాయ మైన్ క్లియరింగ్ నౌకలతో పాటు, స్వయంప్రతిపత్తితో (Autonomous) పనిచేసే అండర్‌వాటర్ డ్రోన్లను ఈ నౌక ద్వారా మోహరించనున్నారు. ఈ డ్రోన్లు అత్యాధునిక సెన్సర్ల సాయంతో సముద్రగర్భాన్ని నిశితంగా స్కాన్ చేసి, ఇరాన్ సీ మైన్స్‌ను గుర్తించి అత్యంత సురక్షితంగా నిర్వీర్యం చేస్తాయి.
ఇవి కూడా చదవండి
సురక్షిత కారిడార్ల ఏర్పాటు దిశగా..
డ్రోన్ల ఆపరేషన్‌తో పాటు, యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల భద్రత నడుమ చమురు, ఇంధన నౌకల కోసం సురక్షితమైన కారిడార్లను ఏర్పాటు చేయాలని అమెరికా మిత్రదేశాలు భావిస్తున్నాయి. మరోవైపు, ఇరాన్ గడ్డపై గ్రౌండ్ ఆపరేషనే లక్ష్యంగా అమెరికా ఇప్పటికే వేలాది మంది మెరైన్ కమాండోలను పశ్చిమాసియాకు (Strait of Hormuz) తరలించిన విషయం విధితమే.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇరాన్ అమ్ములపొదిలో 6 వేల సీ మైన్స్
అంతర్జాతీయ నిఘా వర్గాల అంచనా ప్రకారం.. ఇరాన్ అమ్ములపొదిలో ప్రస్తుతం 2,000 నుంచి 6,000 వరకు సీ మైన్స్ ఉన్నాయి. వీటిని రష్యా, చైనాల నుంచి భారీగా కొనుగోలు చేయడంతో పాటు స్థానికంగా కూడా ఉత్పత్తి చేస్తోంది. గతంలో 1980ల్లో జరిగిన ‘ట్యాంకర్ వార్’ (Tanker War) సమయంలోనూ ఇరాన్ భారీగా సీ మైన్లను వాడి అనేక వాణిజ్య నౌకలను ధ్వంసం చేసింది. అయితే పాతతరం మైన్స్వీపర్ నౌకలు (Minesweepers) సముద్రగర్భంలో ఉన్న ఈ తరహా ఆధునిక (Strait of Hormuz) మైన్లను తొలగించడంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. మైన్స్వీపర్ల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్లే, ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు బ్రిటన్ ఇప్పుడు అత్యాధునిక ఏఐ అండర్‌వాటర్ డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఈ డ్రోన్ల ఆపరేషన్ విజయవంతమైతే పశ్చిమాసియా జలాల్లో ఇరాన్ ఆధిపత్యానికి గట్టి బ్రేక్ పడినట్లేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








