అమెజాన్ మరో సంచలన నిర్ణయం
టెక్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదివేలకు పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమేకాదు, కొత్త నియామకాలను కూడా ఆలస్యం చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జాయిన్ కావాల్సిన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల జాయింనింగ్స్ కూడా వాయిదా వేసుకుంది. అమెజాన్లో కొత్త నియామకాలు 2023, మే నాటికి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం గ్లోబల్ మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ నియామకాలు 2023 చివరి వరకు పొడిగిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు వారికి ఇంటర్నల్ మెయిల్లో సమాచారం అందించిందట. ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, నియామకాలలో కొందరికి ప్రారంభ తేదీలను ఆరు నెలల వరకు ఆలస్యం చేస్తున్నామనీ, అలాగే ఆలస్యం కారణంగా ప్రభావితమైన కొత్త ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తామని కూడా అమెజాన్ తెలిపింది. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నామంటూ వారికి ఈ మెయిల్ సందేశాన్ని పంపింది.













