అగ్రరాజ్యం లో కలకలం.. పదేళ్ల తర్వాత తొలి కేసు
అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు దశాబ్దం తర్వాత పోలియో కలకలం సృష్టించింది. పదేళ్ల తర్వాత తొలి కేసు నమోదైనట్లు అమెరికా ప్రకటించింది. రాక్లాండ్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తికి పోలియా పాజిటివ్‌గా తేలినట్లు న్కూయార్క్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. వ్యాధుల నియంత్రణ నిర్మూల కేంద్ర వివరాల ప్రకారం.. అమెరికాలో చివరి సారిగా 2013లో పోలియో కేసు నమోదైంది. నోటి ద్వారా పోలియే వ్యాక్సిన్ (ఓపీపీ) తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలోనే నోటి ద్వారా వేసే వ్యాక్సిన్‌కు స్వస్తి పలికింది అమెరికా. అమెరికా వెలుపల ఓపీవీ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి నుంచి ఈ వైరస్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధునాత వ్యాక్సిన్ల ద్వారా కొత్త రకాలు ఉద్భవించవు అని పేర్కొంది. న్యూయార్క్ ఆరోగ్య విభాగం. వైరస్ వ్యాప్తిని గుర్తించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. పోలియో టీకా తీసుకోని ప్రజలు వెంటనే వేసుకోవాలని హెచ్చరించింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.













