తానా మహాసభల పోస్టర్‌

తానా మహాసభల పోస్టర్‌

27-03-2017

తానా మహాసభల పోస్టర్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సెయింట్‌లూయిస్‌లో మే 26 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే 21వ తానా మహాసభలను పురస్కరించుకుని విడుదల చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సెయింట్‌ లూయిస్‌లోని అమెరికా సెంటర్‌లో మహాసభలు జరగనున్నాయి.

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేలా సాహితీ సదస్సులు, ఆకట్టుకునే పాటలతో రూపొందించిన సంగీత విభావరి కార్యక్రమం, ఉత్తేజ పరిచే సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు సంప్రదాయ వినోద కార్యక్రమాలను మహాసభల్లో ప్రదర్శించనున్నారు. వివిధ రంగాల్లో పేరు పొందిన నిష్ణాతులకు ఆత్మీయ పురస్కారాలను కూడా ఈ మహాసభల్లో ఇస్తున్నట్లు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. ఈ మహాసభలకు కన్వీనర్‌గా చదలవాడ కూర్మనాథ్‌ వ్యవహరిస్తున్నారు.