టీవీ వాల్‌కు మోడ్రన్ లుక్.. ట్రెండింగ్ డెకర్ ఐడియాలు ఇవే!
మన మన ఇంట్లో రకరకాల డెకోరేషన్లు చేసుకుంటాం. ఇంటిని చాలా అందంగా తయారు చేసుకుంటాం. అయితే.. మన లివింగ్ రూమ్ కి అందరమైన, ఆధునిక రూపం ఇచ్చేది మాత్రం టీవీ యూనిట్ అలంకరణ. ఇదే చాలా ముఖ్యమైంది. టీవీ కేవలం వినోదం కోసమే కాకుండా, ఇంటి అందాన్ని పెంచే ఒక ప్రధాన ఆకర్షణగా మార్చుకోవడానికి కొన్ని ఆలోచనలు వున్నాయి. వీటి ద్వారా టీవీ యూనిట్ అలంకరణ అందర్నీ ఆకర్షిస్తుంది.
టీవీ వాల్‌కు ట్రెండీ లుక్

అయితే.. ఇందులో ప్రధానమైంది టీవీ వెనుక వుండే గోడే ముఖ్యమైంది. ఈ గోడను ప్రత్యేకంగా డిజైన్ చేయడం ద్వారా టీవీ యూనిట్ కి ఓ లగ్జరీ లుక్ వస్తుంది. ప్రస్తుతం మాత్రం ఓ లుక్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ‘‘వర్టికల్ వుడెన్ స్లాట్స్’’ చాలా ట్రెండింగ్ లోనే వున్నాయి. ఇవి గదికి వచెచ్చని, సంప్రదాయ, ఆధునిక లుక్ ను ఇస్తాయి.
అలాగే తక్కువ బడ్జెట్ లో మంచి లుక్ కనిపించాలంటే మాత్రం మార్బుల్ డిజైన్ తో చేస్తే బాగుంటుందని అంటుంటారు. మార్బుల్ డిజైన్ గల లామినేట్ షీట్లను బ్యాక్ గ్రౌండ్ గా చూడొచ్చు. టీవీ వెనుక గోడకు ముదురు రంగు లేదా రాయల్ టెక్స్చర్ పెయింట్ వేయడం, లేదా మంచి జ్యామితీయ (Geometric) వాల్‌పేపర్‌ను అతికించడం ద్వారా టీవీ హైలైట్ అవుతుంది.
టీవీ యూనిట్‌కు మోడ్రన్ డెకరేషన్

అలాగే గోడకు అమర్చే ఫ్లోటింగ్ టీవీ యూనిట్లు కింద స్థలాన్ని (Floor space) ఆదా చేస్తాయి. ఇవి గదిని పెద్దదిగా మరియు క్లీన్‌గా చూపిస్తాయి.టీవీకి ఇరువైపులా లేదా పైన చిన్న చిన్న ఓపెన్ షెల్ఫ్స్ పెట్టి, వాటిపై అలంకరణ వస్తువులను అమర్చవచ్చు. దీని ద్వారా టీవీ అలంకరణ మరింత అందగా అవుతుంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం టీవీ చుట్టూ వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన బొమ్మలు, రైతులు పొలాన్ని దున్నే ఫొటోలు కూడా ఎక్కువ ట్రెండింగ్ లో వున్నాయి. దీని ద్వారా మరింత ఆకర్షణీయంగా వుంటుంది. అలాగే టీవీ ప్యానెల్ వెనుక లేదా షెల్ఫ్స్ కింద కన్సీల్డ్ ఎల్ఈడీ స్ట్రిప్ లైట్లను (Profile Lights) అమర్చితే మరింత బాగుంటుంది.
గ్రీనరీతో క్లీన్ టీవీ యూనిట్ లుక్

చిన్న చిన్న మనీ ప్లాంట్లు, సక్యూలెంట్లు లేదా స్నేక్ ప్లాంట్లను ఉంచడం ద్వారా టీవీ యూనిట్‌కు సహజమైన లుక్ వస్తుంది. అలాగే పుస్తకాలు & ఫ్రేమ్‌లను కొన్ని పుస్తకాలను అందంగా అమర్చండి. అలాగే కుటుంబ సభ్యుల చిన్న ఫోటో ఫ్రేమ్‌లు లేదా ఆర్ట్ వర్క్‌లను పెట్టవచ్చు. తెల్లటి సిరామిక్ పూలకుండీలు లేదా చిన్న బుద్ధుని విగ్రహాలు ప్రశాంతమైన రూపాన్ని ఇస్తాయి. అలాగే తెల్లటి సిరామిక్ పూల కుండీలు లేదా చిన్న బుద్ధుని విగ్రహాలు, వినాయక విగ్రహాలు కూడా మంచి లుక్ ను ఇస్తుంటాయి.
అయితే.. ఎంత బాగు చేసుకున్నా.. ‘‘వైర్స్’’ బయటికి కనిపిస్తే.. చేసిందంతా పోతుంది. ఇందుకోసం వైర్స్ ను కూడా ఓ పద్ధతి ప్రకారం బయటికి కనిపించకుండా చూడాల్సి వుంటుంది. ఎంత మంచి డిజైన్ ఉన్నా వైర్లు బయటకు కనిపిస్తే అందం పాడవుతుంది. కాబట్టి, సెట్-టాప్ బాక్స్, వై-ఫై రూటర్ వైర్లను ప్యానెల్ వెనుక దాచేలా (Concealed wiring) ప్లాన్ చేసుకోవాలి.
బడ్జెట్లో స్టైలిష్ టీవీ యూనిట్స్
గోడకు అమర్చే ఫ్లోటింగ్ టీవీ యూనిట్, నేలపై స్థలాన్ని ఆదా చేస్తూ, గదికి చక్కని, ఆధునిక రూపాన్ని అందిస్తుంది. ఈ డిజైన్‌లో పరికరాలు మరియు అలంకరణ వస్తువుల కోసం ఓపెన్ షెల్ఫ్‌లు లేదా డ్రాయర్లు ఉంటాయి, అందువల్ల ఇది చిన్న లివింగ్ రూమ్‌లకు బడ్జెట్‌కు అనువైన అద్భుతమైన ఎంపిక.
లామినేటెడ్ టీవీ యూనిట్ చాలా తక్కువ ధరకే ప్రీమియం చెక్క రూపాన్ని అందిస్తుంది. ఇది మీ స్థలానికి సరిపోయేలా వివిధ రంగులు మరియు ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇది మన్నికైనది, నిర్వహించడం సులభం మరియు ఆధునిక ఇంటీరియర్లతో చక్కగా కలిసిపోతుంది. ఇలా రకరకాలైన ఒక స్టైలిష్ టీవీ యూనిట్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వున్నాయి.








