ఇలాంటివి వైసీపీకి కొత్త కాదు : బొత్స
మనిషి అనేవాడికి స్వార్థం ఉంటుందని, రాజకీయ పార్టీయే శాశ్వతమని వైసీపీ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. విశాఖలోని వైసీపీ(YCP) కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయనను మీడియా ప్రతినిధులు ఆయన మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను (Chinna Srinu) వైసీపీని వీడి టీడీపీ(TDP)లో చేరిన అంశంపై ప్రశ్నించగా.. పార్టీలోకి మనుషులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ పని పార్టీ చేస్తుంది. ఆయన పార్టీ మారడంలో వింత ఏముంది. ఇలాంటివి వైసీపీకి కొత్త కాదు అని అన్నారు.








