దానయ్య కుటుంబానికి ఎన్నారై టీడీపీ ఆర్థిక సాయం
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju) కుమారుడు బైక్ తో ఢీకొట్టడంతో చనిపోయిన గొర్రెల కాపరి దానయ్య (Danayya) కుటుంబానికి టీడీపీ ఎన్నారై విభాగం నాయకులు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీ ఫోరం ప్రతినిధులు పుట్టగుంట సురేష్ (Puttagunta Suresh), సయ్యద్ షా ఫర్హాద్ (Syed Shah Farhad) సమకూర్చిన నగదు చెక్కును మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గౌతు శిరీషా (Gouthu Sirisha) చేతుల మీదుగా అందజేశారు.








