ఘనంగా గ్లోబల్ ఎన్నారై టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
గ్లోబల్ ఎన్నారై టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనంలో వైభవంగా జరిగింది. 45 మందితో నూతనంగా ఏర్పాటైన కార్యవర్గంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. అనివార్య కారణాలతో రాలేకపోయిన కొందరు సభ్యులు జూమ్ కాల్ ద్వారా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి టీడీపీ జాతీయ కార్యనిర్వా హక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గ్లోబల్ ఎనఆరఐ టీడీపీ నూతన అధ్యక్షుడిగా డా. పిల్ గురురాజా బాధ్యతలు స్వీకరించారు.
జనరల్ సెక్రటరీలుగా డా. చలసాని కిషోర్‌బాబు, బొడ్డు గంగాధరరావు, డా. ముక్కు తులసీకుమార్, ఉపాధ్యక్షులుగా కోమటి జయరాం, పుట్టగుంట సురేష్, మద్దిపట్ల ఇంద్రసేననాయుడు, రషీదా షేక్, కోడూరి శ్యాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కానూరు హేమా, ముప్పవరపు మాధవి, డా. చావా పద్మ, షాఫహద్ సయ్యద్, ఆళ్ల వెంకట్, చెంచు వేణుగోపాల్, బొద్దులూరి యాష్, అన్నమేటి బాలసుబ్రమణ్యం, నక్కల శివనాగరాజు, అడుసుమిల్లి విజయకుమార్, జవ్వాది విజేత, ఖాలీద్ సైఫుల్లా, కౌతారపు లావణ్య, కోడి రాజారవికిరణ్, రాచూరి రెడ్డి మోహన్, చెన్నుపాటి విజయ్, కార్యదర్శులుగా అడుసుమిల్లి కృష్ణప్రియ, రవడ సుభాష్, బెజవాడ సూర్య, పరుచూరి తరణీ, జడ నాగరాజు, పొనుగోటి పింకీ రేవతి, పల్లేటి రాజేష్‌బాబు, గోగినేని శ్రీనివాస్, నన్నా అనీల్, గాలి దుర్గాభవాని, పేరూరు రామకృష్న, వంకా వెంకటరమణమ్మ, నంబళ్ల గోపీ రవికుమార్, పరుచూరి కవిత, జొన్నలగడ్డ నర్మద, గుడివాడ వెంకటరమణ, కోశాధికారిగా అబ్బూరి శ్రీనివాస్, సమన్వయకర్తలుగా దొడ్డపనేని సాగర్, బొల్లినేని సాయి, కోట గౌతమీశ్వేత ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు, వారి కుటుంబ సభ్యులతోపాటు అభిమానులతో పార్టీ కేంద్ర కార్యాలయం కిక్కిరిసి పోయింది.








