ఒకే బౌల్లో కంప్లీట్ మీల్.. కూరగాయలు, చీజ్‌తో అదిరిపోయే హెర్బ్ రైస్!
రోజూ అన్నం తింటూనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే రైస్ బౌల్ (Rice Bowl) ఒక మంచి ఎంపిక. ఇంట్లో ఉన్న అన్నం, మనకు నచ్చిన కూరగాయలు, కొన్ని మసాలా దినుసులు, కొద్దిగా చీజ్‌తో రుచికరమైన వంటకాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎక్కువ సమయం వంటగదిలో గడపలేని వారికి ఈ రెసిపీ ఉపయోగపడుతుంది. మధ్యాహ్న భోజనంగా లేదా రాత్రి డిన్నర్గా తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి పనీర్, చికెన్ లేదా గుడ్డు జోడించి ప్రోటీన్ పరిమాణాన్ని కూడా పెంచుకోవచ్చు.
రైస్ బౌల్ కావలసిన పదార్థాలు

ఈ రైస్ బౌల్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని మన అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. క్యారెట్ (Carrot) , క్యాప్సికమ్ (Capsicum) , ఉల్లిపాయ (Onion) , స్వీట్ కార్న్ (Sweet Corn) , బ్రోకలీ (Broccoli) వంటి కూరగాయల్లో మీకు నచ్చిన వాటిని ఉపయోగించవచ్చు. కూరగాయల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అన్నం శరీరానికి శక్తినిస్తుంది. పనీర్ (Paneer) , గుడ్డు (Egg) లేదా చికెన్ (Chicken) జోడించడం వల్ల ప్రోటీన్ కూడా అందుతుంది. ఇలా ఒకే గిన్నెలో వివిధ పోషకాలు ఉండేలా భోజనాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
వెజిటబుల్ సాస్ తయారీ విధానం

ఇవి కూడా చదవండి
ఈ వంటకం తయారీకి ఒక కప్పు ఉడికించిన అన్నం, ఒక కప్పు తరిగిన కూరగాయలు, ఒక టీస్పూన్ నూనె, అర టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ (Chilli Flakes), అర టీస్పూన్ ఒరేగానో (Oregano), కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల తురిమిన చీజ్ (Cheese) తీసుకోవాలి. అదనంగా ప్రోటీన్ కోసం 75–100 గ్రాముల పనీర్ (Paneer), ఉడికించిన లేదా గ్రిల్ చేసిన చికెన్ (Grilled Chicken) లేదా ఒకటి నుంచి రెండు గుడ్లు ఉపయోగించవచ్చు.
వెజిటబుల్ సాస్ కోసం పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ వంటి కూరగాయలను వేసి మీడియం మంటపై కొన్ని నిమిషాలు వేయించాలి. కూరగాయలు పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు టొమోటో ప్యూరీ వేసి 2 నిమషాలు ఉడికించాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో వేసి కలపాలి. చివరగా తురిమిన చీజ్ చల్లి మూత పెట్టి ఒకటి రెండు నిమిషాలు ఉంచాలి.
హెర్బ్ రైస్ బౌల్ తయారీ విధానం

ఇప్పుడు హెర్బ్ రైస్ కోసం ఒక బౌల్లో ఉడికించిన అన్నం, చిల్లి ఫ్లెక్స్, ఒరేగానో , కాస్త కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఒకవైపు గ్రిల్ చేసిన పనీర్ లేదా చికెన్, మరోవైపు సాటే చేసిన కూరగాయలు అమర్చాలి. పైన ముందుగా రెడీ చేసిన వెజిటబుల్ సాస్ పోసి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లాలి. తర్వాత గ్రిల్ చేసిన పనీర్ లేదా చికెన్ ముక్కలు జోడించాలి. గుడ్డు ఇష్టపడేవారు బాయిల్డ్ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. ఈ రైస్ బౌల్ కి ఎగ్ ఆమ్లెట్ కూడా బాగుంటుంది.
రుచితో పాటు పోషకాలను అందించే ఈ రైస్ బౌల్‌ను మరింత ఆరోగ్యకరంగా చేసుకోవాలంటే కూరగాయల పరిమాణాన్ని పెంచి, నూనె, ఉప్పు, చీజ్‌ను పరిమితంగా ఉపయోగించాలి. అన్నం తాజాగా ఉడికించినదైనా లేదా సురక్షితంగా నిల్వ చేసినదైనా సరే, సరైన విధంగా వేడి చేసి తీసుకోవాలి. మీకు నచ్చిన పదార్థాలతో ప్రతిరోజూ కొత్త రుచిలో ఈ సులభమైన మీల్‌ను సిద్ధం చేసుకోవచ్చు.








