కోవిడ్ టీకా తీసుకున్న టాటా గ్రూపు సంస్థల అధినేత

టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‍లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి అందరూ సురక్షితంగా ఉంటారని భావిస్తున్నట్లు రతన్ టాటా తన ట్వీట్‍లో అభిప్రాయపడ్డారు.