అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్-19 బారిన పడ్డారు. జలుబు, దగ్గు వంటి కరోనా స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. ప్రస్తుతం ఆయన డెలావెర్‌లో ఉన్న తన నివాసంలో ఐసొలేషన్‌లో ఉన్నారని వెల్లడించింది.