జూన్ 7న వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) ఆధ్వర్యంలో ‘BBY5K’ రన్ & వాక్!
WATS: వాషింగ్టన్ తెలుగు సమితి (WATS), కింగ్ కౌంటీ పార్క్స్ సంయుక్త భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకమైన ‘BBY5K 2026’ రన్/వాక్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ వేడుక జూన్ 7, 2026 (ఆదివారం) రోజు రెడ్మండ్లోని మేరీమూర్ పార్క్లో అట్టహాసంగా జరగనుంది.
గడిచిన 13 ఏళ్లుగా సుమారు 13,000 మందికి పైగా రన్నర్లు , వాకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని, కింగ్ కౌంటీ పార్కుల అభివృద్ధి కోసం దాదాపు $80,000 పైగా నిధులను సేకరించడం విశేషం. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కమ్యూనిటీ స్ఫూర్తిని చాటేందుకు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు:
- తేదీ: జూన్ 7, 2026 (ఆదివారం)
- వేదిక: మేరీమూర్ పార్క్, రెడ్మండ్, వాషింగ్టన్ (Marymoor Park, Redmond, WA)
- విభాగాలు: 1K కిడ్స్ రన్, 5K రన్/వాక్ , 10K రన్/వాక్.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వారు www.bby5k.com వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ‘WATS50’ అనే డిస్కౌంట్ కోడ్ను ఉపయోగించి ఫీజులో 50 శాతం రాయితీ పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫిట్నెస్ , ఫన్ ఈవెంట్లో తెలుగు వారందరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు.
నిర్వహణ కమిటీ:
మధు రెడ్డి (ప్రెసిడెంట్), ప్రకాష్ కొండూరు (వైస్ ప్రెసిడెంట్), రామ్ తమ్మినేని (జనరల్ సెక్రటరీ), హరిణి దేశరాజు (ట్రెజరర్), శివ వేదురుపాటి (కల్చరల్ సెక్రటరీ), శ్రీరామ్ పాటిబండ్ల (లిటరరీ సెక్రటరీ), కృష్ణ కోటపాటి (వెబ్ మాస్టర్) ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని వివరాలకు board@watsweb.org లేదా www.watsweb.org ను సందర్శించవచ్చు.
ఇవి కూడా చదవండి








