శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు సన్నాహాలు పూర్తి…శ్రీనివాస్ భర్తవరపు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో జూన్ 6, 2026 శనివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు హిక్స్విల్లేలోని అసామై హిందూ టెంపుల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో, ఆగమ పండితులు శ్రీ వెంకటాచార్యులు గారు (Pittsburgh Head Priest), వేద పండితులు శ్రీ హనుమంతరావు గార్ల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంప్రదాయ విధానంలో ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ మహోత్సవానికి భక్తుల నుండి లభించిన అపూర్వ స్పందన, స్పాన్సర్షిప్స్, రిజిస్ట్రేషన్లు మరియు సహకారానికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పరిమిత స్థల సామర్థ్యం కారణంగా రిజిస్ట్రేషన్లు అధికారికంగా ముగించబడినప్పటికీ, నమోదు చేసుకోలేకపోయిన భక్తులు కూడా స్వామివారి దర్శనం, దివ్య ఆశీర్వాదాలు మరియు ప్రసాదం కోసం సాదరంగా ఆహ్వానించబడుతున్నారని తెలిపారు.
కళ్యాణంలో పాల్గొనడానికి నమోదు చేసుకున్న భక్తులు తప్పనిసరిగా ముందుగానే విచ్చేసి, వారికి కేటాయించిన స్థానాలలో కూర్చొని ప్రధాన పూజా కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
కమ్యూనిటీ బలోపేతం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువల పరిరక్షణ లక్ష్యంగా తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి గారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని శ్రీనివాస్ భర్తవరపు తెలిపారు. కమ్యూనిటీ సభ్యులందరూ కలిసి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను Event Coordinator ప్రసాద్ కోయి ఆధ్వర్యంలో సుచరిత అనంతనేని, రజిత కల్లూరి సమన్వయం చేస్తున్నారు.
అలాగే న్యూయార్క్ టీమ్ సభ్యులు దిలీప్ ముసునూరు, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్ నాదేళ్ల, ఉమా పోలిరెడ్డి, శ్రీనివాస్ పలాటి, ప్రదీప్ అరవేటి, రాజేష్ కడియాల, సునీల్ చల్లగుళ్ల, రవీంద్ర ఉప్పాల, సురేష్ మల్నీడి, కృష్ణకిషోర్ జమ్ముల, శ్రీహరి పర్ణ, కలీం మహమ్మద్, రాఘవేంద్ర మాదాల, విజయ్ కుమార్ లావు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 📞 (347) 668-9861, (646) 812-4020, (631) 245-9011, (516) 949-9498 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఈ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు సాదరంగా ఆహ్వానించారు.








