TAL Ugadi 2026: లండన్లో ఘనంగా ‘తాల్’ ఉగాది వేడుకలు.. ముఖ్య అతిథిగా వందేమాతరం శ్రీనివాస్
TAL Ugadi 2026: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 2026, మార్చి 21వ తేదీ శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు నార్త్హోల్ట్లోని ‘ఇండియా గార్డెన్స్’ (SKLPC – UK) వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
కార్యక్రమ విశేషాలు:
ముఖ్య అతిథి: ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు వందేమాతరం శ్రీనివాస్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
కళాకారుల సందడి: ఫోక్ సింగర్ రేలారే గంగ, నల్గొండ గద్దర్ నర్సన్న, ప్లేబ్యాక్ సింగర్స్ అఖిల్ చంద్ర, శ్రీనిక మహతి తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు: సినీ సంగీతం, బృంద నృత్యాలు, హాస్య వల్లరితో పాటు సాంప్రదాయ పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి విందు ఉంటుంది.
టికెట్ వివరాలు: పెద్దలకు (13 ఏళ్లు పైబడిన వారు) £30, పిల్లలకు (5-12 ఏళ్లు) £20 గా నిర్ణయించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఈ ధరలోనే స్నాక్స్, డిన్నర్ కూడా కలిపి ఉంటాయి.
తెలుగు సంస్కృతిని, భాషను ప్రవాసంలో ఉన్న మన పిల్లలకు అందించే లక్ష్యంతో తాల్ (TAL) ఈ వేడుకలను నిర్వహిస్తోంది. లండన్, చుట్టుపక్కల ఉన్న తెలుగు వారందరూ ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.








