TAF: టంపాలో మహిళా లోకం సందడి.. ఏప్రిల్ 4న గ్రాండ్‌గా ‘తెలుగు క్వీన్స్ నైట్’!
TAF: ఫ్లోరిడాలోని తెలుగు మహిళల కోసం తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా (TAF) ఒక వినూత్నమైన , ఉత్సాహభరితమైన వేడుకకు శ్రీకారం చుట్టింది. “తెలుగు క్వీన్స్ నైట్ – టాలీవుడ్ గ్లామ్ నైట్” పేరుతో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఏప్రిల్ 4, 2026న ఘనంగా జరగనుంది.
కార్యక్రమ విశేషాలు:
టాలీవుడ్ థీమ్‌తో సాగే ఈ గ్లామ్ నైట్‌లో సంగీతం, నృత్యం , వినోదానికి పెద్దపీట వేశారు.
టాలెంట్ షో: డాన్స్, సింగింగ్ , స్కిట్స్ ద్వారా మహిళలు తమ ప్రతిభను చాటుకోవచ్చు.
ఫ్యాషన్ వాక్: తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా సాగే ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
డ్రెస్ కోడ్: పాల్గొనే వారు తమకు ఇష్టమైన తెలుగు సినిమా క్యారెక్టర్ లాగా ముస్తాబై రావలసి ఉంటుంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: ఈ వేదికపై మహిళా వ్యాపారవేత్తల (Women Entrepreneurs) వివరాలను ప్రదర్శించి వారిని ప్రోత్సహించనున్నారు.
వీటితో పాటు ఇంటరాక్టివ్ గేమ్స్, ఎగ్జైటింగ్ ప్రైజెస్, ఫోటో బూత్, డీజే డాన్స్ ఫ్లోర్ , అల్పాహార విందు వంటి సౌకర్యాలు కల్పించారు.
వేదిక , సమయం:
- తేదీ: ఏప్రిల్ 4, 2026 (శనివారం)
- సమయం: సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు
- వేదిక: న్యూ టంపా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ (New Tampa Performing Arts Center)
ఈ వేడుకకు ప్రవేశం పూర్తిగా ఉచితం (Free Entry), కానీ ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆసక్తి గల మహిళలు ఇమేజ్‌లో ఉన్న QR కోడ్ ద్వారా లేదా ఆన్లైన్ లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.








