TTA: టిటిఎ టంపా చాప్టర్ రక్తదాన శిబిరం విజయవంతం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) – టంపా చాప్టర్ (Tampa Chapter) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కమ్యూనిటీ మరియు అంకితభావం కలిగిన వాలంటీర్ల అద్భుత సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టిటిఎ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ అయ్యప్ప సొసైటీ ఆఫ్ టంపా అధ్యక్షుడు విజయ్ అన్నకు. వారి ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి అనుమతించినందుకు టిటిఎ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసినందుకు వన్ బ్లడ్ కు ప్రత్యేక ప్రశంసలను వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో 20 మందికి పైగా పాల్గొన్నారు, అందులో 10 మంది రక్తదానం చేశారు. ప్రతి రక్తదానం ఒకరి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంది, నిస్వార్థంగా సహకరించిన ప్రతి దాతకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టిటిఎ నాయకులు తెలిపారు.
టిటిఎ టంపా ఛాప్టర్ నాయకులు దిలీప్ వాసా, రఘు అలగుబెల్లి, ఆర్‌వీపిలు ప్రవీణ్ గజ్జల, క్రాంతి మేక, రాజేష్ యామ్సాని, రాజేష్ రెడ్డి ఆర్‌సీలు రూపేష్ యామా, మోనికా కులకర్ణి, పృథ్వీ అలగుబెల్లి మరియు ప్రణయ్ ముంగరా లకు వారి అవిశ్రాంత కృషికి మరియు నిరంతర మద్దతుకు టిటిఎ నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలను, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన వాలంటీర్లు మరియు సహాయకులందరికీ మేము ఎంతో రుణపడి ఉంటామని టిటిఎ నాయకులు తెలియజేశారు.







