మీ పాస్ వర్డ్ సురక్షితమా.. కాదా?
హ్యాకర్లకు చిక్కకుండా సురక్షితమైన పాస్‌వర్డ్‌లను తయారుచేసుకోవడంలో వినియోగదారులకు ఉపయోగపడే సరికొత్త మీటర్‌ను షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు. మెదడులోని నాడీ కణాలను తలపించేలా ఈ మీటరులో కృత్రిమ నాడీ వ్యవస్థ ఉంటుంది. వినియోగదారుల పాస్‌వర్డ్‌లను క్షణ కాలంలో ఈ మీటర్ విశ్లేషిస్తుంది. వాటిని హ్యాకర్లు ఊహించే ముప్పుంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఎందుకు పసిగట్టే అవకాశాలున్నాయో కూడా వివరిస్తుంది. కొత్త పాస్వర్డ్ సృష్టించుకోవాలని సూచిస్తుంది. అత్యంత సురక్షితమైన పాస్‌వర్డ్‌ల సృష్టికి తాజా ఆవిష్కరణ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.













