వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకంగా మాటా బిజినెస్ ఫోరం
వ్యాపార రంగంలో ముందుకు సాగాలనుకునే ఔత్సాహికులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు మరియు వృత్తి నిపుణులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో మాటా బిజినెస్ ఫోరం 2026 ఏర్పాటు చేశారు. ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వితౌట్ లిమిట్స” అనే అంశంతో జరుగనున్న ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు మరియు పరిశ్రమ నాయకులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. నాయకత్వం, వ్యాపార విస్తరణ, పెట్టుబడుల సమీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, సంపద సృష్టి మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి. వ్యాపార విజయానికి అవసరమైన నైపుణ్యాలు, మారుతున్న సాంకేతిక ప్రపంచంలో అవకాశాలు మరియు భవిష్యత్ వ్యాపార ధోరణులపై అవగాహన కల్పించడమే ఈ ఫోరం ప్రధాన లక్ష్యమని మాటా ప్రతినిధులు తెలిపారు.
ఇందులో గ్లోబల్ బిజినెస్ లీడర్, నోబెల్ ప్రైజ్ నామినీ, రచయిత, ఎంట్రప్రెన్యూర్ డా. ఎం.ఎస్. రెడ్డి, ఎకో సిస్టమ్ బిల్డర్, ఇన్నోవేటర్, ఎంట్రప్రెన్యూర్, టెడ్స్ స్పీకర్ ఇన్నోవేట్ 100 సిఇఓ, ఫౌండర్ జేమ్స్ బారూద్ పాల్గొని మాట్లాడనున్నారు. జూన్ 20 మధ్యాహ్నం 1.30 నుంచి 3.00వరకు ఈ కార్యక్రమం జరగనున్నది.
ఈ బిజినెస్ కమిటీకి కో ఆర్డినేటర్‌గా కళ్యాణి బెల్లంకొండ వ్యవహరిస్తున్నారు.








