డల్లాస్లో ఎకోలక్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ప్రదర్శన
పర్యావరణ హితమైన లగ్జరీ ఆభరణాలకు పేరుగాంచిన ఎకోలక్స్ సంస్థ అమెరికాలోని డల్లాస్ నగరంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ప్రదర్శనను నిర్వహిస్తోంది. మార్చి 13 14 తేదీల్లో ఫ్రిస్కోలోని హిల్టన్ గార్డెన్ ఇన్లో ఈ ప్రదర్శన విజయవంతంగా ప్రారంభం కాగా మార్చి 15 ఆదివారం నాడు కోపెల్ లోని ఫోర్ పాయింట్స్ బై షెరటన్ హోటల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ షోకేస్ కొనసాగనుంది.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ డైమండ్లపై 25 శాతం వరకు మేకింగ్ ఛార్జీలపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఎటువంటి టారిఫ్ ఛార్జీలు లేకపోవడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఉచిత కానుకను కూడా అందజేయనున్నారు. ఈ ప్రదర్శనలో అత్యుత్తమ శ్రేణి ఆభరణాలను వీక్షించడంతో పాటు భాగస్వామ్య అవకాశాల గురించి తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 786-604-1857 లేదా 91 90049 70657 నంబర్లను సంప్రదించవచ్చు.








