ఎన్నారై టీడిపి కేంద్ర కమిటీ ప్రెసిడెంట్ గా డా. రాజా
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎన్నారై విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలను తీసుకోవడంతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, టీడీపీ ఎన్నారై జాతీయ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు, విదేశాంధ్రులను పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. 44 మంది సభ్యులతో కూడిన ఈ భారీ కమిటీకి నూతన అధ్యక్షుడిగా డాక్టర్ పిల్లి రాజాను నియమించారు. ప్రచారానికి దూరంగా ఉంటూ పార్టీ కోసం తెరవెనుక విశేషంగా పనిచేసిన ‘డాక్టర్ రాజా’ సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం, ప్రవాస తెలుగువారితో ఆయనకున్న అనుబంధం, సంస్థాగత అనుభవం, నాయకత్వం, వ్యూహాత్మక దృష్టిని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టీడీపీ ఎన్నారై విభాగాలను సమన్వయం చేసి బలమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించడంతోపాటు, ప్రవాస తెలుగు వారి మేధస్సు, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నవకల్పన, యువత సాధికారతకు అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీని మరింత శక్తివంతంగా తయారుచేయడంతోపాటు 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కూడా రాజా పేర్కొన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజా నియామకం పట్ల పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శుల బాధ్యతలను ముగ్గురికి అప్పగించారు. జి. గంగాధర్, ముక్కు తులసి కుమార్, చలసాని కిశోర్ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించనున్నారు. ఉపాధ్యక్షులుగా జయరామ్ కోమటి, ఇంద్రసేన నాయుడు మద్దిబాట్ల, రషీదా బేగం, సురేష్ పుట్టగుంట, శ్యామ్ కొడూరిలను నియమించారు.
కమిటీలోని ఇతర సభ్యులు, వారి పదవుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఆర్గనైజింగ్ సెక్రటరీలు: విజేత జవ్వాది, బాలసుబ్రహ్మణ్యం అన్నమేటి, విజయ్ అడుసుమిల్లి, శివ నాగరాజు నక్కల, కౌతారపు లావణ్య, మాధవి ముప్పవరపు, రాజా రవికిరణ్ కోడి, సైఫుల్లా ఖలీద్, రాచూరి మోహన్, అల్లా వెంకట్, చావా పద్మ, వేణుగోపాల్ రెడ్డి, యష్ బొద్దులూరి, హేమ కోసూరు, విజయ్ చెన్నుపాటి.
కార్యదర్శులు: శ్రీనివాస్ గోగినేని, రాజేష్ పల్లేటి, నాగరాజు జడ, పింకీ పొనుగోటి, పేరూరు రామకృష్ణ, గాలి దుర్గాభవాని, వంకా వెంకటరమణమ్మ, కృష్ణ ప్రియ అడుసుమిల్లి, సూర్య బెజవాడ, తరణిధర్ పరుచూరి, సుభాష్ రావడ, జోగి నాయుడు, వెంకట రమణ, గోపి నంబళ్ల, కవిత పరుచూరి, అనిల్ కుమార్ నున్నా, నర్మద జొన్నగడ్డ.
ఇతర ముఖ్య బాధ్యతలు: సోషల్ మీడియా విభాగం బాధ్యతలను స్వాతి రెడ్డి, సాయి బొల్లినేనికి అప్పగించారు. కమిటీ కోశాధికారి (ట్రెజరర్)గా శ్రీనివాస్ అబ్బూరిని నియమించారు.
ఎన్నారై విభాగంలో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వారికి ఈ నూతన కమిటీలో ప్రాధాన్యత కల్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ సానుభూతిపరులను సమన్వయం చేసేందుకు ఈ మార్పులు చేశారు. ఈ నూతన కమిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.









