న్యూయార్క్ లో బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి వేడుకలు
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి వేడుకలకు న్యూయార్క్ తెలుగు సమాజం అందించిన అపూర్వ స్పందనకు SPB మ్యూజిక్ అకాడమీ (SPBMA) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. సంగీత మాధుర్యం, మధుర స్మృతులు, హృదయాన్ని తాకే సంగీత నివాళులతో ఈ కార్యక్రమం చిరస్మరణీయ సంగీత విభావరిగా నిలిచింది.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డా. శరత్ చంద్ర గారు “స్వర విభావరి” కార్యక్రమం ద్వారా గాన గంధర్వులు శ్రీ ఘంటసాల గారు, శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గార్లకి సంగీత నివాళులు అర్పించారు. మిమిక్రీ రమేష్ గారు తన సహజ హాస్యంతో పాటు అద్భుత గానంతో ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి తమ బృందాలతో విచ్చేసిన న్యూయార్క్ జాతీయ, స్థానిక తెలుగు సంఘాల నాయకత్వానికి SPBMA కృతజ్ఞతలు తెలిపింది.
తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ (TLCA) నుండి చైర్మన్ శ్రీ నాగేంద్ర గుప్తా గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ శనిగెపల్లి గారు; నుండి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీ రంజిత్ క్యాతం గారు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జయప్రకాశ్ ఎంజాపురి గారు; న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA) నుండి చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా గారు, అధ్యక్షుడు డా. రవీందర్ కొడెల గారు విచ్చేశారు. ఇంత మంది సమక్షం లో పాడడం యువ గాయకులకు ఎంతో ప్రోత్సాహం కలిగించింది అన్నారు SPBMA!
ఇవి కూడా చదవండి
అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాటలు పాడారు. భారత దేశం లోని ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచినుండి సందర్శన కోసం వచ్చిన గాయకులకు కూడా వారి అభ్యర్ధన మేరకు ఈ కార్యక్రమం లో అవకాశం ఇచ్చారు. వారు బాలు గారి చక్కని హిందీ పాటలు పాడి అలరించారు.
డా. శరత్ చంద్ర గారు గాయకులను అభినందిస్తూ, సంగీతంపై ఆసక్తిని పెంపొందిస్తున్న బాల ప్రతిభల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఘంటసాల, బాలు గార్ల పాటల పాడుతూ, కీ బోర్డ్ వాయిస్తూ, పాటల గురించి వివరిస్తూ, అద్భుతమైన నివాళి అందించారు. గాయకుల పాటలు విశ్లేషిస్తూ, సలహాలు సూచనలు ఇస్తూ, వారిని అభినందించారు.
NYTTA అధ్యక్షలు శ్రీ రవీందర్ కోడెల గారి సతీమణి, శ్రీమతి పద్మ కొడెల గారు మరియు వారి కుమార్తె వర్ష రూపొందించిన అద్భుత పూల అలంకరణలు, “Balu” అక్షరాలతో అలంకరించిన భారీ “80” ప్రతిరూపం (ఈనాటికి బాలు గారి వయసు), రంగురంగుల తోరణాలు సభా వేదికకు సంగీత ఉత్సవాల కళను తెచ్చాయి.
SPBMA చైర్మన్ డా. హరి ఎప్పనాపల్లి గారు సంగీతాన్ని అంకితభావంతో నేర్చుకుంటున్న గాయకులను అభినందిస్తూ, భావి తరాల గాయకులను తీర్చిదిద్దేందుకు SPBMA నిరంతరం శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తుందని తెలిపారు. SPBMA అధ్యక్షుడు శ్రీనివాస్ గూడూరు గారు, ఉపాధ్యక్షురాలు రాజీ బుర్ర గారు కార్యక్రమ నిర్వహణలో విశేష కృషి చేస్తూ, గాన వారసత్వ పరిరక్షణకు SPBMA అంకితభావంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఘంటసాల సంగీత పరిరక్షణకు, వేలాది మంది విద్యార్థులకు సంగీత శిక్షణ అందించేందుకు చేస్తున్న విశేష సేవలకు గాను డా. శరత్ చంద్ర గారిని “గాన కళా తపస్వి” బిరుదుతో ఘనంగా సత్కరించారు.
తమ మిమిక్రీ కళా ప్రదర్శనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మిమిక్రీ రమేష్ గారిని కూడా ఘనంగా సన్మానించి, వారి అమెరికా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్ బ్రూస్ బ్లేక్మన్ కార్యాలయం తరఫున శ్రీమతి జింగ్ జావో గారు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంఘాలకు, తెలుగు సమాజానికి అందిస్తున్న సహకారానికి SPBMA తరఫున నాసా కౌంటీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
SPBMA బోర్డు సభ్యురాలు శ్రీమతి సుజాత వెంపరాల గారు, సలహాదారులు, సంఘ సేవకులు శ్రీ దాము గేదెల గారు, IGNOU డైరెక్టర్ మరియు మీడియా నిపుణుడు డా. రవి అయ్యగారి గారు కార్యక్రమ విజయానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.
స్వయంగా గాయని, రచయిత్రి, రేడియో జాకీ, కవయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి, శ్రీమతి రాజేశ్వరి బుర్రా, కార్యక్రమానికి వ్యాఖ్యాత గా వ్యహరించారు. పాటల వివరాలు తెలుపుతూ, గాయకులను, ఆహూతులను పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని హుషారుగా నడిపి రక్తి కట్టించారు.
అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు గాయకులను అభినందిస్తూ, సంగీతంపై ఆసక్తిని పెంపొందిస్తున్న బాల ప్రతిభల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ప్రశంసించారు. కష్టమైన వీకెండ్ ట్రాఫిక్ మధ్య కూడా కుటుంబాలతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గాయకులకు, వారి కుటుంబాలకు సంగీతాభిమానులకు మా ప్రత్యేక ధన్యవాదాలు.
మహేష్ దోమల గారు, విజయేందర్ బాస గారు, రమా వనమ గారు, కుమార్ బుద్ధరాజు గారు, ప్రసాద్ సనాపతి గారు కార్యక్రమ నిర్వహణకు అధ్బుతమైన సహకారం అందించారు.
NYTTA వైస్ చైర్మన్ శ్రీ లక్ష్మణ్ అనుగు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరి చరణ్ బొబ్బిలి, బోర్డ్ డైరెక్టర్లు శ్రీ కృష్ణ బాధే, శ్రీ శరత్ వేముగంటి, సలహాదారులు శ్రీ చినబాబు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమా వనమ గార్లు; పూర్వాధ్యక్షులు సునీల్ గడ్డం గారు, వాణి సింగిరికొండ గారు, వాణి రెడ్డి ఏనుగు గారు; TLCA జాయింట్ ట్రెజరర్ శ్రీమతి సుధా మన్నవ గారు, TTA సంఘ సభ్యులు, పలువురు సంఘ నాయకులు హాజరై కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.
ఈ సంగీత నివాళి కార్యక్రమాన్ని చిరస్మరణీయ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ SPB మ్యూజిక్ అకాడమీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది.








