ఆటా కాన్ఫరెన్స్లో స్పెషల్ అట్రాక్షన్.. ఆగస్టు 1, 2 తేదీల్లో ‘వివాహ పరిచయ వేదిక’!
ATA: అమెరికన్ తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మక ఉత్సవం ’19వ ఆటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్’ వేదికగా ‘ఆటా వివాహ పరిచయ వేదిక’ (ATA Matrimony) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న ప్రవాస తెలుగు యువతీ యువకులకు, వారి తల్లిదండ్రులకు ఇదొక చక్కని వేదిక కానుంది.
వివరాలు..
- తేదీలు: ఆగస్టు 1వ , 2వ తేదీలు, 2026.
- వేదిక: బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ (Baltimore Convention Center), మేరీల్యాండ్.
- రిజిస్ట్రేషన్ ఫీజు: $50.
నమోదు చేసే విధానం..
ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా అర్హులైన వధూవరుల వివరాలను తెలుసుకోవడంతో పాటు, నేరుగా వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల వారు ఆటా అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఫ్లయర్పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
కమిటీ వివరాలు..
ఈ కార్యక్రమ విజయవంతం కోసం ఒక ప్రత్యేక మ్యాట్రిమోనీ కమిటీ పనిచేస్తోంది.
- ఛైర్: అనిత ముత్తోజు (Anitha Muthoju) – 516-850-8949
- కో-ఛైర్: లక్ష్మీ పురుషోత్తం (Lakshmi Purushottam)
- అడ్వైజర్స్: శ్రీధర్ తిరుపతి, కవిత చల్లా.
అలాగే ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా , ఇతర కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ 19వ ఆటా మహాసభలు జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ఘనంగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి








