Jhummandi Naadam: ‘ఆటా’ 19వ మహాసభల సందర్భంగా ‘ఝుమ్మంది నాదం’ గాన పోటీలు
ATA: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ మహాసభల సందర్భంగా, సంగీత ప్రియుల కోసం ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) పేరుతో సోలో గాన పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్వహణ కమిటీ విడుదల చేసింది.
పోటీల వివరాలు:
ఈ సింగింగ్ కాంపిటీషన్లను రెండు విభాగాల్లో నిర్వహిస్తున్నారు.
- జూనియర్స్: 7 నుండి 14 సంవత్సరాల వయస్సు వారు.
- సీనియర్స్: 15 సంవత్సరాలు నిండిన వారు.
అట్లాంటా, ఆస్టిన్, షార్లెట్, చికాగో, డల్లాస్, లాస్ ఏంజిల్స్, నాష్విల్లే, రాలీ, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా , వాషింగ్టన్ డీసీ/మేరీల్యాండ్/వర్జీనియా వంటి ప్రధాన నగరాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
తుది పోటీలు (Finals): జూలై 31 – ఆగస్టు 2 మధ్య బాల్టిమోర్‌లో జరిగే 19వ ఆటా మహాసభల్లో జరుగుతాయి.
- రిజిస్ట్రేషన్ గడువు: ఏప్రిల్ 15, 2026.
- ఫీజు: ఆటా సభ్యులకు $30, సభ్యులు కాని వారికి $50.
- బహుమతులు: విజేతలకు ‘ఆటా టైటిల్’తో పాటు ప్రముఖ సినీ సెలబ్రిటీల చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు.
నిర్వహణ కమిటీ:
ఈ పోటీల విజయవంతం కోసం చైర్ సుధా కొండపు, కో-చైర్లు నవీన్ సారగడం, కృష్ణ పొడగట్లపల్లి ఆధ్వర్యంలో అడ్వైజర్స్ శారద సింగిరెడ్డి, రామకృష్ణ రెడ్డి అల, అనిల్ బొద్దిరెడ్డి , సభ్యులు వెంకట భరద్వాజ్, దీపక్ కల్పన, శ్రీని చుండి, వివేక్ పాలెపు శ్రమిస్తున్నారు.
ఆసక్తి గలవారు ataconference.org వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నారు.








