తానా ఆధ్వర్యంలో అక్టోబర్ 24 న ‘‘ఫుడ్ డ్రైవ్’’
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో ‘‘తానా మిడ్ అట్లాంటిక్ ఫుడ్ డ్రైవ్’’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 24 వ తేదీన ఉదయం 11:00 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. 600BENT CREEK BLVD MECHANICSBURG, PA 17050 వేదికగా గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఇందులో పాల్గొనేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
అయితే.. ఇందులో ముఖ్యంగా పీనట్ బటర్, కేనడ్ బీన్స్, కేనడ్ సూప్ప్, కేనడ్ ఫ్రూట్స్, కేనడ్ మీట్స్, కేనడ్ వెజిటేబుల్స్, మేక్రోని, చీస్, పాస్తా, రైస్, షాంపు, సోప్స్ టూత్ పేస్ట్, క్లీనింగ్ సప్ల్రై అధికంగా అవసరం అవుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, శ్రీనివాస్ లావు, రవి పుట్లూరు, సాయి బొల్లినేని ఆధ్వర్యంలో, యూత్ వాలెంటీర్స్ వేదసాయి అబ్బూరి, అశితా చౌదరి కోటా, జెస్ే గుండాలా, సంజన చౌదరి ముప్పా, సంజన కోటా, ఆద్యా పైడి, లాస్య బొమ్మినేని, శ్రియ నిమ్మగడ్డ, సుజల్ రామచంద్రుని సారథ్యంలో వాలెంటీర్లు పనిచేస్తున్నారు.








