‘టాక్సిక్’పై ప్రేక్షకుల ఆగ్రహం? టిక్కెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్? థియేటర్‌కు పోలీసులు!
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఓ ప్రక్కన సోషల్ మీడియా, మీడియా, యూట్యూబ్ రివ్యూయర్స్ .. సినిమా డిజాస్టర్ అనటంతో నిర్మాతలు రంగంలోకి దిగి వాళ్లకు నోటీసులు ఇస్తూ కట్టడి చేస్తున్నారు. కోర్టుకు వెళ్లి మరీ సినిమాపై నెగిటివ్ ప్రచారం జరగకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. యష్ యాంటి ఫ్యాన్స్ ఈ సినిమా గురించి రకరకాల న్యూస్ లు షేర్ చేస్తున్నారు. అలా తాజాగా ఓ వీడియో ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముంది.
Bro #yash created a new record in Indian cinema.. that nobody else has been able to achieve till now🔥🔥🔥
People asking for refunds😭.No way😭😭!! Easily Biggest disaster of the decade
#Toxicthemovie 🤡 pic.twitter.com/w5SzKkf0Bd
— 👑 (@KicchaBossCultt) August 27, 2026
‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ రిలీజైన ఓ థియేటర్లలో సినిమా నచ్చలేదంటూ కొందరు ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, చివరకు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.ఇప్పుడా వీడియో వివాదాస్పదమైంది.
సినిమా ముగిసిన తర్వాత ఒక్కసారిగా గందరగోళం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. ఓ థియేటర్లో సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత ప్రేక్షకుల గుంపు ఆగ్రహంతో కనిపించింది. తమ టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వారు పెద్దగా నినాదాలు చేస్తున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపటికే పోలీసులు థియేటర్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు ఆ వీడియో ఆధారంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్ కావడంతో ‘టాక్సిక్’పై మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. అయితే అది టాక్సిక్ వీడియో అని కన్ఫర్మ్ గా ఎలా చెప్తాం అని అంటున్నారు. అలాగే టెక్నికల్ కారణాలు వల్ల షో వెయ్యలేదని, అందుకే టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇవ్వమని అడుగుతున్నారని, అంతే కానీ సినిమా బాగోలేకపోవటంతో రిఫండ్ అడగటం కాదని అంటున్నారు మరికొందరు.
కొంతమంది ప్రేక్షకులు సినిమా విషయంలో తీవ్రంగా నిరాశ చెందామని చెబుతుండగా, మరికొందరు మాత్రం ఒక్క వీడియో ఆధారంగా సినిమాను పూర్తిగా విఫలమైందని తేల్చడం సరికాదని అంటున్నారు. అయితే ప్రేక్షకులు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బహిరంగంగా డిమాండ్ చేస్తున్న దృశ్యాలు మాత్రం సినిమాపై వస్తున్న ప్రతికూల స్పందనకు మరింత ఆజ్యం పోశాయి.
ఓ నెటిజన్ అయితే, ‘‘భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ సాధించలేని కొత్త రికార్డును యశ్ సృష్టించాడు. ప్రేక్షకులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. ఇది దశాబ్దంలోనే అతిపెద్ద డిజాస్టర్’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
విమర్శలు ఉన్నా.. ఓపెనింగ్ మాత్రం భారీగానే!
అయితే ‘టాక్సిక్’పై వస్తున్న ప్రతికూల లేదా మిశ్రమ స్పందనకు, సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లకు మధ్య మాత్రం ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రేక్షకుల నుంచి కొంత నెగిటివ్ రెస్పాన్స్ , సమీక్షల నుంచి అనుకూలత కంటే విమర్శలే ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా తొలి రోజే భారీ వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి.
తొలి రోజు భారత్‌లో ‘టాక్సిక్’ దాదాపు రూ.101 కోట్ల నికర వసూళ్లు, సుమారు రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందులో హిందీ వెర్షన్ సుమారు రూ.55 కోట్లు సాధించగా, కన్నడ వెర్షన్ రూ.25 కోట్ల కంటే తక్కువగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ దాదాపు రూ.11 కోట్ల వసూళ్లు సాధించినట్లు సాక్నిల్క్ గణాంకాలు పేర్కొంటున్నాయి.
అంటే ఒకవైపు థియేటర్లలో కొంతమంది ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరోవైపు సినిమా తొలి రోజే వంద కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించడం ‘టాక్సిక్’ చుట్టూ ఉన్న పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది.








