Yami Gautham: ప్రతీదీ షేర్ చేసుకోలేంటున్న యామీ గౌతమ్
కమర్షియల్ యాడ్ ద్వారా అందరికీ సుపరిచితురాలైన యామీ గౌతమ్(Yami Gautham) తర్వాత కొరియర్ బాయ్ కళ్యాణ్(Courier Boy Kalyan) సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. అయితే ఆ మూవీ డిజాస్టర్ అవడంతో తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడి డైరెక్టర్ ఆదిత్య ధర్(Adithya Dhar) ను పెళ్లాడి అక్కడే సినిమాలు చేస్తూ నటిగా కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా ఒక ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని మెయిన్టెయిన్ చేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటూ ఉంటారు.
అందులో తమ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటారు. కానీ యామీ గౌతమ్ దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా గురించి తనకు తెలుసని, తనక్కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని కానీ అందులో తన వ్యక్తిగత వివరాలేమీ పంచుకోనని అలా అందరికీ షేర్ చేయడం తనకేమాత్రం నచ్చదని యామీ తెలిపింది.
తన గురించి బయటి ప్రపంచం ఆలోచించాలని తను కోరుకోవడం లేదని, ఆడియన్స్ కు ఆర్టిస్టుల గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత బావుంటుందని అప్పుడే వారు ఆ క్యారెక్టర్లకు ఎక్కువగా కనెక్ట్ అవుతారని చెప్తోన్న యామీ తన కొడుకును కూడా సోషల్ మీడియాకు దూరంగా పెంచుతానని చెప్తోంది.








